నల్లమలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
నాగర్ కర్నూల్, 24 ఆగస్టు (హి.స.) నాగర్ కర్నూలు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అమ్రాబాద్ మండలంలో ఆదివారం శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మండలంలోని జంగం రెడ్డిపల్లి,
మంత్రి సీతక్క


నాగర్ కర్నూల్, 24 ఆగస్టు (హి.స.)

నాగర్ కర్నూలు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అమ్రాబాద్ మండలంలో ఆదివారం శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మండలంలోని జంగం రెడ్డిపల్లి, కల్ములోనిపల్లి, మాధవన్ పల్లి, మొలకమామిడి, తుర్కపల్లి గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ, అంగన్వాడి భవనాలకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఒక్కొక్క నూతన భవనానికి రూ.20 లక్షల చొప్పున నిధులతో నూతన భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి నల్లమల్ల ప్రాంతానికి వచ్చిన సందర్భంగా అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande