ఆంజనేయ స్వామి కోనేరు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, 24 ఆగస్టు (హి.స.) శతాబ్దాల చరిత్ర కలిగిన మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్దనున్న పురాతన కోనేరు పునరుద్ధరణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించి పూడికతీత పనులకు తొలి అడుగు వేశా
మంత్రి శ్రీహరి


నారాయణపేట, 24 ఆగస్టు (హి.స.)

శతాబ్దాల చరిత్ర కలిగిన మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్దనున్న పురాతన కోనేరు పునరుద్ధరణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించి పూడికతీత పనులకు తొలి అడుగు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోనేరు శిధిలావస్థకు చేరడం వల్ల ఆలయ భక్తులకు నీటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. డిసెంబర్లో జరగబోయే వార్షిక జాతర నాటికి కోనేరును పూర్తిగా పునరుద్ధరించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. పడమటి ఆంజనేయస్వామి అందరికీ సంబంధించిన దేవుడని, ఈ కోనేరు ఆలయ ఆస్తి, ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని తెలిపారు. పునరుద్ధరణ పనులకు పట్టణ ప్రజలు శ్రమదానం చేస్తే తను ఆర్థిక వనరులను సమకూరుస్తానని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande