వరంగల్, 24 ఆగస్టు (హి.స.)
నర్సంపేట పట్టణానికి చెందిన మహిళా
ఖైదీ సుచరిత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నర్సంపేట సబ్ జైలర్ లక్ష్మీ శృతి సస్పెండ్ అయ్యారు. ఈనెల 13న సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం కేసులో అరెస్ట్ కాబడిన పెండ్యాల సుచరితను రిమాండ్ కోసం నర్సంపేట మహిళా జైలు కి తరలించారు. తీవ్ర అనారోగ్య బారిన పడిన మహిళా ఖైదీ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 21న మృతి చెందింది.
ఈ ఘటనపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. మరో వైపు జైలు నుంచి విడుదలైన మహిళా ఖైదీ ఆడియో అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు మహిళా ఖైదీ ఆరోగ్య పరిస్థితిని జైలర్ సరిగ్గా అంచనా వేయనట్లు, సకాలంలో చికిత్సను అందించలేక పోయినట్లు గుర్తించినట్లు సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. వరంగల్ ఉమెన్ జైలర్ స్రవంతిని నర్సంపేట మహిళా జైలుకు పూర్తి స్థాయి ఇంచార్జ్ గా నియమించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్