నిర్మల్, 24 ఆగస్టు (హి.స.)
గత ఆగస్టు నెలలో ఒక ఆర్మీ అధికారి కుటుంబానికి నిర్మల్ సమీపంలో ప్రమాదం జరిగింది. అయితే బాధితులను నిర్మల్ ఏ ఎస్పీ రాజేష్ మీనా, టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని దేవేందర్ రెడ్డి హాస్పిటల్లో చేర్చారు. ఆస్పత్రి వైద్యులు ఆర్మీ కుటుంబానికి అత్యవసర చికిత్సలు అందించి వారి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ రెడ్డి అందించిన సేవలను అభినందిస్తూ ఆర్మీ జనరల్ మేజర్ సోనా రామ్ ప్రశంసా లేఖ పంపారు. ఆర్మీ జనరల్ పంపిన ప్రశంసా లేఖను నిర్మల్ అదనపు ఎస్పీ రాజేష్ మీనా తదితరులు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ దేవేందర్ రెడ్డికి అందజేసి సన్మానించారు. నిర్మల్ జిల్లా ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న తమను భారత ఆర్మీ జనరల్ తమ ఆస్పత్రి సేవలను గుర్తించి ప్రశంసా లేఖను పంపడం సంతోషంగా ఉందని డాక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు