నిర్మల్, 24 ఆగస్టు (హి.స.)
నేరాల నియంత్రణకు సీసీ టీవీలు ఎంతో మేలు చేస్తాయని బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఏఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ నగర్ ఏరియాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి, సరియైన ధృవ పత్రాలు లేని 86 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి కొరకై ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామని, కాలనీల్లో, ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనబడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఏరియాలో వచ్చే వారికి పూర్తి తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని వివరాలు సూచించారు.
పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చి దిద్దడంతో పాటు ప్రజలకు రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతో ముఖ్యమని ప్రజలు వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు