సంతోష్నగర్లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్..
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.) సంతోష్నగర్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్లో విద్యార్థుల భద్రత దృష్ట్యా స్కూల్ వాన్స్, బస్సులు, ఆటోరిక్షాలపై తనిఖీలు నిర్వహించారు. లోడ్ బండ్లు, గూడ్స్ ఆటోలు రహదారులపై ఇబ్బందులు కలిగించడంత
ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

సంతోష్నగర్ ట్రాఫిక్ పోలీసులు

ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవ్లో విద్యార్థుల భద్రత దృష్ట్యా స్కూల్ వాన్స్, బస్సులు, ఆటోరిక్షాలపై తనిఖీలు నిర్వహించారు. లోడ్ బండ్లు, గూడ్స్ ఆటోలు రహదారులపై ఇబ్బందులు కలిగించడంతో కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. పండ్ల బండ్ల కారణంగా వచ్చే ట్రాఫిక్ సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు అధికారులు వెల్లడించారు. నెంబర్ ప్లేట్లు ఉద్దేశపూర్వకంగా కప్పివేసిన వాహన యజమానులపై మోటార్ వెహికల్స్ యాక్ట్ 129(2) ప్రకారం రూ.2 వేల వరకు జరిమానా లేదా నెల రోజుల జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ డ్రైవ్లో 10 మంది మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించారు. వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు,యజమానులు న్యాయస్థానం ఎదుట హాజరై జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande