సిద్దిపేట, 24 ఆగస్టు (హి.స.) గ్రామాలలో ఆర్ఎంపి, పిఎంపిల
క్లినికులను సీజ్ చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్, వైద్య, గ్రామపంచాయతీ ఇతర అధికారులతో కలిసి డెంగీ నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ.. గ్రామాలలో రివర్స్ సర్వే, డెంగీ పరీక్షలు నిర్వహించాలని, ఇలాంటి లక్షణాలు ఉన్న ఫీవర్ సర్వే, డెంగీ పరీక్షల నిర్వహించి వెంటనే టి హబ్బుకు పంపించి రిజల్ట్ తీసుకోవాలని వైద్య అధికారులకు ఆదేశించారు.
ఇండ్లలో నీటి నిలువ ఉండకుండా బయట చెత్తాచెదారం, టైర్లు ఇతర ప్రాంతాలు నీరు చేరి దోమలు వ్యాపించి రోగాల బారిన పడకుండా గ్రామపంచాయతీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో అసాధారణ వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పి రమేష్ క్లినిక్ సీజ్ చేయాలని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హెచ్ఓ ను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..