హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
: కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్ర ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల అనంతరం మగ్దూం భవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. గాంధీ మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. మగ్దూం భవన్ వద్ద గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతిమయాత్ర ముగిసిన అనంతరం సురవరం భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబసభ్యులు అప్పగించారు.
అంతిమయాత్ర పొడవునా ‘కామ్రేడ్ సురవరం సుధాకర్‌రెడ్డి అమర్ రహే’ అంటూ సీపీఐ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. అంతిమయాత్రలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి.. శుక్రవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ