జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకుండా ముప్పుతిప్పలు - స్టాలిన్‌
చెన్నై/న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.) కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించేదిశగా ఎన్నో కమిటీలు ఏర్పాటైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించివేయడమే పనిగా పెట్టుకుందని, జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల
DMK's Electoral Preparations: CM Stalin to Review Membership Drive


చెన్నై/న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.) కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించేదిశగా ఎన్నో కమిటీలు ఏర్పాటైనా కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించివేయడమే పనిగా పెట్టుకుందని, జీఎస్టీ ద్వారా ఎక్కువగా ఆదాయం ఇచ్చే రాష్ట్రాలకు సరిపడా నిధులను విడుదల చేయకుండా ముప్పుతిప్పలు పెట్టడం భావ్యమేనా అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు.

కొత్త చట్టాలు తీసుకొచ్చి, రాష్ట్రాల హక్కులన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండే రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తోందని ఆరోపించారు.

చేపాక్‌లోని కలైవానర్‌ అరంగంలో కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించకూడదనే స్ఫూర్తితో 50 యేళ్ళలో సమాఖ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన సంఘటనలను అధ్యయనం చేసి, అవసరమైన రాజ్యంగ సవరణలు చేయడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలను పెంపొందించే దిశగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. 1983లో కర్ణాటకలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత అప్పటి కేంద్రం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్కారియా నేతృత్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిషన్‌ రాష్ట్రాలకు మరిన్ని అధికారులు కల్పించేలా తగని సిఫారసులు చేయలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఏర్పాటైన జస్టిస్‌ పుంచీ కమిషన్‌ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించే వారినే గవర్నర్లుగా నియమించాలని సిఫారసు చేసిందని, ఇలా వరుసగా కమిటీలు చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోకపోగా కేంద్రం కొత్త చట్టాలు తీసుకువచ్చి రాష్ట్రాల హక్కులను హరించి వేస్తోందని స్టాలిన్‌ ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande