అనంతపురంలో హై టెన్షన్.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నం
అనంతపురం, 24 ఆగస్టు (హి.స.) అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించేందుకు యత్నించారు. ఫ్యాన్స్ ముట్టడి విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బారికేడ్లత
/jr-ntr-fans-attempt-to-storm-mla-camp-office-in-ananthapu


అనంతపురం, 24 ఆగస్టు (హి.స.) అనంతపురంలో హై టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించేందుకు యత్నించారు. ఫ్యాన్స్ ముట్టడి విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బారికేడ్లతో భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి.. జై ఎన్టీఆర్, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న అభిమానుల్ని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యే ఇంటి వద్దకు కూడా అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పేంతవరకూ నిరసన విరమించబోమని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు స్పష్టం చేశారు. కాగా.. ఆ ఆడియో కాల్ లో మాట్లాడింది తాను కాదని, ఎన్టీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పటికే ఎమ్మెల్యే ప్రసాద్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande