ఆత్మనిర్భర్ భారత్ దిశగా..
న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.) ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా దేశం లిఖిస్తున్న అధ్యాయానికి గగన్‌యాన్‌ మిషన్‌ మొదటి అడుగని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పేర్కొన్నారు. మన దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లి.. పెసలు, మెంతులు వంటి వాటిని పండిస్త
Vande Bharat train service


న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.)

ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా దేశం లిఖిస్తున్న అధ్యాయానికి గగన్‌యాన్‌ మిషన్‌ మొదటి అడుగని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పేర్కొన్నారు. మన దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లి.. పెసలు, మెంతులు వంటి వాటిని పండిస్తారని తానెప్పుడూ ఊహించలేదన్నారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌కు చెందిన శుభాంశు అంతరిక్షంలో రైతుగా మారారని అన్నారు. ఐఎస్‌ఎస్‌లో గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను వేసి..జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని అధ్యయనం చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారత్‌ చేపట్టబోయే అంతరిక్ష యాత్రలకు ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు.. గగన్‌యాన్‌ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందని రాజ్‌నాథ్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో భారత్‌ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ..అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపే చూస్తున్నాయని..న్యూదిల్లీతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నాయని అన్నారు. కాగా 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చందమామ పైకి పంపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande