జీవితంలో ముఖ్యమైన గురువులు వారే: శుభాంశు శుక్లా
న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) పేర్కొన్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణను ఇచ్చినందుకు ఐఏఎఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త
Shubhamshu Shukla and team


న్యూఢిల్లీ: ,24 ఆగస్టు (హి.స.)

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) పేర్కొన్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణను ఇచ్చినందుకు ఐఏఎఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఏఎఫ్‌, కాక్‌పిట్‌ మాత్రమేనని పేర్కొన్నారు. వాటి నుంచే అంతరిక్ష యాత్రకు అవసరమయ్యే చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. భవిష్యత్తులో భారత్‌ చేపట్టనున్న గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని.. చాలామంది శాస్త్రవేత్తలు ఇందులో భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారన్నారు. అంతరిక్షం నుంచి భారత్‌ ఎంతో అందంగా కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు. జీవితంలో తాను చూసిన అద్భుత దృశ్యాలలో అదీ ఒకటన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande