తెలంగాణ, కరీంనగర్. 25 ఆగస్టు (హి.స.) ప్రజల్లో సేవాభావం పెంపొందించేందుకే శ్రమదానం దోహదపడుతుందని ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాాజ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధర ఎస్సీ బాలుర వసతి గృహంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి శ్రమదానం నిర్వహించారు. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ... గ్రామాభివృద్ధి సమాజ శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, నరేందర్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు