అనుమతి లేకపోతే కేబుల్ వైర్లు తొలగించొచ్చు: హైకోర్టు
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను జిహెచ్ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో కేబుల్ కనెక్షన్లను తొలగించవద్దంటూ ప్రముఖ నెట్వర్క్ కంపెనీ అయిన ఎయిర్టెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిప
Airtel


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను జిహెచ్ఎంసి సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో కేబుల్ కనెక్షన్లను తొలగించవద్దంటూ ప్రముఖ నెట్వర్క్ కంపెనీ అయిన ఎయిర్టెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని ఎయిర్టెల్ సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఏయే స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం అనుమతిలేని కేబుళ్లను తొలగించొచ్చని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande