బీసీసీఐ మరో సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11తో ఒప్పందం రద్దు
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీమిండియాకు ప్రస్తుతం ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. మరోవైపు ఆన్లైన్ గేమింగ్ బిల్లు భ
బిసిసిఐ


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

భారత క్రికెట్ నియంత్రణ మండలి

(BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీమిండియాకు ప్రస్తుతం ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11తో ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. మరోవైపు ఆన్లైన్ గేమింగ్ బిల్లు భారత పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం వచ్చింది. అదేవిధంగా భవిష్యత్తులో కొత్త చట్టాన్ని అనుసరించి గేమింగ్ యాప్స్ సంస్థలతో స్పాన్సర్షిప్ ఉండబోవని బీసీసీఐ ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు రియల్ మనీ గేమింగ్ యాప్లపై నిషేధం అమల్లోకి రానుండటంతో డ్రీమ్ 11 ప్రతినిధులు కూడా తమ ఆదాయానికి గట్టి దెబ్బ తగిలిన నేపథ్యంలో టీమిండియా కు ఇక స్పాన్సర్గా కొనసాగలేమని బీసీసీఐకి తెలియజేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande