దమ్ముంటే దొంగ ఓట్లను బయటకు తీయాలి.. కాంగ్రెస్కు ఎంపీ డీకే అరుణ సవాల్
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) తెలంగాణ లోనూ దొంగ ఓట్లు ఉన్నాయని.. ఆ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలుపొందారనీ టీపీసీసీ చీఫ్ మహేశ్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి. అసలు దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదని, బీజ
డీకే అరుణ


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

తెలంగాణ లోనూ దొంగ ఓట్లు ఉన్నాయని.. ఆ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలుపొందారనీ టీపీసీసీ చీఫ్ మహేశ్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి. అసలు దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదని, బీజేపీలా తాము దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగలేదని మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాంటి ఓట్లతో గెలిచే అవవాటు హస్తం పార్టీకే ఉందన్నారు. ఓడిపోయినప్పుడు మాత్రమే కాంగ్రెస్కు ఫేక్ ఓట్లు గుర్తుకొస్తాయని క్లాస్ పీకారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande