రంగారెడ్డి, 25 ఆగస్టు (హి.స.)
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.3,50 వేల ఎంపీ నిధులతో ఏర్పాటుచేసిన ఆరీ వాటర్ ప్లాంట్ను స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ ఆసుపత్రిని 50 లక్షలు వెచ్చించి మరమ్మత్తులు చేసినట్లు చెప్పారు. ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు