ఢిల్లీ, 25 ఆగస్టు (హి.స.)సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా మహిళా కామాండోలను రంగంలోకి దించనుంది. అన్ని రకాల ట్రైనింగ్ పూర్తయిన తర్వాతే వారిని విధుల్లో ఉంచనుంది. ఎయిర్‌పోర్టులు, ఇతర సున్నిత ప్రదేశాల్లో వారిని విధుల్లో పెట్టనుంది. ప్రస్తుతం మహిళా కమాండోలకు సంబంధించి మధ్య ప్రదేశ్, బార్వాహలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ ఇస్తున్నారు.
దాదాపు 8 వారాల పాటు వారికి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. తర్వాత వారిని క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)లతో హై సెక్యూరిటీ ప్రదేశాలతో పాటు ఇతర కార్యాలయాల దగ్గర విధుల్లో పెట్టనున్నారు. మొదటి బ్యాచ్‌లో భాగంగా 30 మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆగస్టు 11వ తేదీన ట్రైనింగ్ మొదలైంది. అక్టోబర్ 4వ తేదీ వరకు ట్రైనింగ్ కొనసాగుతుంది. రెండో బ్యాచ్ అక్టోబర్ 6వ తేదీనుంచి మొదలవుతుంది. నవంబర్ 29వ తేదీ వరకు కొనసాగుతుంది.
సీఐఎస్ఎఫ్ మొత్తం 100 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి విధుల్లో ఉంచనుంది. ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్, ఆయుధాల శిక్షణ, ఒత్తిడిలో లైవ్-ఫైర్ డ్రిల్స్, రన్నింగ్, అబ్‌స్టాకిల్ కోర్సులు, రాపెల్లింగ్, అడవుల్లో ఎలా బతకాలన్న దానిపై ట్రైనింగ్ ఉంటుంది. 48 గంటల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్‌సైజ్ కూడా ఉంటుంది. నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితిలో కూడా టీమ్‌తో కలిసి ఎలా పని చేస్తున్నారన్న దాన్ని 48 గంటల కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్‌సైజ్‌లో పరీక్షిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి