నేడు మళ్ళీ ఢిల్లీకి సీఎం.. ఫిరాయింపులపై న్యాయ సలహా కోసమేనా?
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం అయ్యాక ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 52వ సారి కావడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికలు, 42 శాతం బీసీ రిజర్వేషన్, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశాలపై న్
సీఎం ఢిల్లీ


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం అయ్యాక ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 52వ సారి కావడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికలు, 42 శాతం బీసీ రిజర్వేషన్, ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశాలపై న్యాయ నిపుణుల సలహా తీసుకునేందుకే ఆయన ఈసారి ఢిల్లీ వెళ్తున్నట్టు సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండగా, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నది. ఈ వ్యవహారంలో అసలు స్థానిక ఎన్నికలకు వెళ్లాలా? బిల్లు పెండింగ్ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా? అన్న అంశంపై ఆయన న్యాయ సలహాలు తీసుకుంటారని చెప్తున్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande