హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)
తెలంగాణ, ఉస్మానియా ఈ రెండు యూనివర్సిటీలు అవిభక్త కవలలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ.90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం డిజిటల్ లైబ్రరీతో పాటు రీడింగ్ రూమ్ను ఓపెన్ చేశారు. అదేవిధంగా దుందుభి, బీమా వసతి భవనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఓయూ వైస్ ఛాన్స్లర్ వీసీ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా వర్సిటీలో పర్యటించాలంటూ వీసీ ఆహ్వానించారని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారని తెలిపారు. ఉస్మానియా వర్సిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని అన్నారు. నిజాం నవాబును పొగుడుతూ పాడటం కాదు.. దేశ స్వాతంత్య్రం కోసం ఓయూ గడ్డపై నిలబడి వందేమాతరం పాడిన పీవీ నరసింహా రావు నేడు తనకు గుర్తొస్తున్నారని తెలిపారు. సాయుధ పోరాటంలో భాగంగా మారుమూల పల్లెల్లో ఎర్రజెండా పట్టుకుని పోరాటం చేసిన ఎందరో మహాభావులు ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్