అమరావతి, 25 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కానిస్టేబుల్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఫరూక్ బాషా అనే సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను సోమవారం సుప్రీం ధర్మాసనం కొట్టివేస్తున్నట్లు తీర్పువెలువరించింది. రఘురామ, అతడి కార్యాలయ సిబ్బంది దాడి చేశారంటూ కొన్నేళ్ల కిందట కేసు వేసిన పిటిషనర్ ఫరూక్.. ఈ కేసును తాను కొనసాగించుకోదలచుకోవడం లేదంటూ అత్యున్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జెకే మహేశ్వరి ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ