దేవుని ఉనికిని తిరస్కరించే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలం: కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆదివారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీలను గెలించిందని తీవ్ర ఆరోపణలు చేశా
బండి సంజయ్


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆదివారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో దొంగ ఓట్లు ఉన్నాయని, ఆ దొంగ ఓట్లతోనే బీజేపీ 8 ఎంపీలను గెలించిందని తీవ్ర ఆరోపణలు చేశాడు. అలాగే దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ కూడా ఎంపీగా గెలిచేవాడు కాదని, బీజేపీ రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడిగిందని, ఎన్నికల సమయంలో మాత్రమే బీజేపీకి రాముడు గుర్తుకు వస్తాడని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ X వేదికగా స్పందించాడు. ఆయన తన ట్వీట్లో నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా రాముడిని బీజేపీ పార్టీ సభ్యుడిగా చూస్తూ ఎగతాళి చేస్తుంది. దేవుని ఉనికినే తిరస్కరించే పార్టీ దాని బుద్ధిహీన నాయకుల నుండి మనం ఇంకా ఏమి ఆశించగలం? 2007లో రామసేతు కేసులో అఫిడవిట్ దాఖలు చేస్తూ రాముడిని కోర్టులోకి లాగింది కాంగ్రెస్ పార్టీ.

ఆ సమయంలో “రాముడు లేడు, రామాయణం లేదు” కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. _ దశాబ్దాలుగా, కాంగ్రెస్ రామమందిర ద్వారాలకు తాళం వేసింది. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం వాటిని తెరిచిందని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మరింత ముందుకు వెళ్లి మందిర్ ఉద్యమాన్ని 'ఓడించారని', హిందువులను 'హింసాత్మకులు' అనే ముద్ర వేశారని, కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కు హాజరు కావడానికి కూడా నిరాకరించిందని ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande