కుషాయిగూడ లో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టం
అగ్ని ప్రమాదం


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)

హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ తుక్కు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 9.30 గంటల తర్వాత గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో గోదాం చుట్టు పక్కల ఉన్న నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తున్నది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు గోదాం నిర్వాహకులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande