జమ్ము/జైపుర్/న్యూఢిల్లీ: , 25 ఆగస్టు (హి.స.) : ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరద నీరు ముంచెత్తడంతో రహదారులు, వంతెనలు, భవనాలు దెబ్బతిన్నాయి. రాజస్థాన్‌లో వర్ష సంబంధ ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. ఈ రాష్ట్రంలోని దౌసాలో 29 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు జమ్మూలో 24 గంటల వ్యవధిలో 19 సెం.మీ. వర్షపాతం కురిసింది. జమ్మూలోని ఐఐఐఎం హాస్టల్ ప్రాంగణంలో వరద నీటిలో చిక్కుకుపోయిన 45 మంది విద్యార్థులను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. కఠువా జిల్లాలోని జమ్మూ-పఠాన్‌కోట్ హైవేకు సమీపంలో ఉన్న సహర్ ఖడ్ నది ఉప్పొంగడంతో ఓ వంతెన కుంగింది. హిమాచల్ ప్రదేశ్‌లో రెండు జాతీయ రహదారులు సహా 484 రోడ్లను మూసివేశారు. మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ