మాస్కో/న్యూఢిల్లీ: , 25 ఆగస్టు (హి.స.) రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పశ్చిమ దేశాల విమర్శలను న్యూదిల్లీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. తాజాగా రష్యాకు భారత రాయబారి వినయ్ కుమార్ (India envoy to Russia Vinay Kumar) దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు (Russian Oil) కొనుగోలు చేస్తుందని పునరుద్ఘాటించారు.
రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ ఈ అంశం గురించి ప్రస్తావించారు. ‘‘మా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే న్యూదిల్లీకి మొదటి ప్రాధాన్యం. ఉత్తమమైన డీల్‌తో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి భారత కంపెనీలు (Indian Oil Companies) చమురు కొనుగోలు చేస్తాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. రష్యాతో భారత సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి’’ అని భారత రాయబారి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ