వేములవాడ రాజన్న సేవలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి..
వేములవాడ, 25 ఆగస్టు (హి.స.) దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్నను సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ప్రీతికైన కోడె మొక్కులు చెల్లించుకొని, అనంతర
మేయర్ విజయలక్ష్మి


వేములవాడ, 25 ఆగస్టు (హి.స.)

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన

వేములవాడ రాజన్నను సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా స్వామివారికి ప్రీతికైన కోడె మొక్కులు చెల్లించుకొని, అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం కళ్యాణ మండపంలో వారికి వేద పండితులు, అర్చకుల ఆశీర్వచనం గావించి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande