మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
మహబూబాబాద్, 25 ఆగస్టు (హి.స.) మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ (బాలికలు), మండల ప్రజా పరిషత్ పాఠశాల గుమ్ముడూరు లను సోమవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఈ
కలెక్టర్ తనిఖీలు


మహబూబాబాద్, 25 ఆగస్టు (హి.స.)

మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ (బాలికలు), మండల ప్రజా పరిషత్ పాఠశాల గుమ్ముడూరు లను సోమవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహం పాఠశాల ఆవరణలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, తరగతి గదులు, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో స్వయంగా మాట్లాడారు.

వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు డైట్ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని, భోజనం సిద్ధం చేస్తున్న సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని, వారికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మానసిక, ఆరోగ్య స్థితిగతులను పరిశీలిస్తూ ఉండాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande