తెలంగాణ, మెదక్. 25 ఆగస్టు (హి.స.)
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు
జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ అన్నారు. జాతీయ రహదారిపై తరుచూగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున సోమవారం అందోలు నియోజకవర్గంలోని 161 జాతీయ రహదారిని మంత్రి దామోదర నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. చౌటకూర్ మండలంలోని శివ్వంపేట నుంచి మొదలుకొని టేక్మాల్ మండలం బొడ్మట్పల్లి వరకు రహదారిని వారు పరిశీలించారు.
శివ్వంపేట, తాడ్ దాన్పల్లి చౌరస్తా, అల్మాయిపేట, డాకూర్, బొడ్మట్పల్లి గ్రామాల జాతీయ రహాదారిపై తరుచూగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ స్థలాల్లోనే అండర్ పాస్లు, వంతెనలను ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ అధికారులకు మంత్రి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు