అనంతగిరి రిసార్ట్స్ కు కొత్త రూపు.. మంత్రి జూపల్లి స్పెషల్ ఫోకస్
తెలంగాణ, వికారాబాద్. 25 ఆగస్టు (హి.స.) వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక అభివృద్ధి దిశగా పలు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వికారాబాద్ కేంద్రంలో సోమవారం ఆయన అనంతగిరి హరిత రిసార్ట్స్, అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాలను ప్
మంత్రి జూపల్లి


తెలంగాణ, వికారాబాద్. 25 ఆగస్టు (హి.స.)

వికారాబాద్ జిల్లా అనంతగిరి

పర్యాటక అభివృద్ధి దిశగా పలు చర్యలు చేపడుతున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వికారాబాద్ కేంద్రంలో సోమవారం ఆయన అనంతగిరి హరిత రిసార్ట్స్, అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హరిత రిసార్ట్స్ పైలట్ ప్రాజెక్ట్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షణకు అప్పగించినట్లు తెలిపారు. ప్రైవేట్ రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక సదుపాయాలతో హరిత రిసార్ట్ను అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వికారాబాద్ పర్యాటక దృష్టిలో ప్రత్యేకత కలిగిన ప్రదేశమని, అనంతగిరి పర్వతాల అందాలు, హరిత రిసార్ట్స్ సదుపాయాలు, వ్యూ టవర్ ఆకర్షణలు మరింత మంది సందర్శకులను ఆకట్టుకుంటాయని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande