ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపీ యూనిట్ని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ, నల్గొండ. 25 ఆగస్టు (హి.స.) నల్లగొండ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి(GGH)లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీ యూనిట్ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వైద
మంత్రి కోమటిరెడ్డి


తెలంగాణ, నల్గొండ. 25 ఆగస్టు (హి.స.)

నల్లగొండ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి(GGH)లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీ యూనిట్ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వైద్య నిపుణులు, పద్మవిభూషణ్ డా. నాగేశ్వర్ రెడ్డి మరియు డా. జి వి రావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెట్రో నగరాల స్థాయి వైద్య సదుపాయాలు అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపీ యూనిట్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగనుంది. శస్త్రచికిత్సలు ఇప్పుడు నల్గొండలోనే అందుబాటులో ఉంటాయి అని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande