కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ గురుకులాలు.. ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి
తెలంగాణ, నారాయణపేట. 25 ఆగస్టు (హి.స.) విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంతోనే కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. సోమవారం మరి
ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి


తెలంగాణ, నారాయణపేట. 25 ఆగస్టు (హి.స.)

విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని

అందించాలని లక్ష్యంతోనే కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. సోమవారం మరికల్ మండలంలోని పసుపుల కేజీబీవీ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande