నిజామాబాద్, 25 ఆగస్టు (హి.స.)
నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ధర్మోరా గ్రామంలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ పట్టణంలోని గౌతమ్ నగర్కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ధర్మోరా గ్రామంలో తనకు పరిచయం ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ మహిళ బంధువులకు ప్రసాద్కు మధ్య గొడవ జరిగింది. అది పెద్దది కావడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ప్రసాద్, అతని స్నేహితుడు మృతి చెందారు. జంట హత్యలతో గ్రామం ఉలిక్కిపడింది. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమా లేదా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్