హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన బాలుడి కుటుంబానికి మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.ఈ పథకం ద్వారా బాధిత బాలుడికి 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు నెలకు రూ. 4,000 చొప్పున సహాయం అందుతుంది. గత మూడు నెలలకు సంబంధించి రూ.12,000 కుటుంబ ఖాతాలో సోమవారం జమ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..