రేవ్ పార్టీ భగ్నం
మాదాపూర్ డీసీపీ వినీత్
రేవ్ పార్టీ భగ్నం


హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)హైదరాబాద్, ఆగస్టు 25 : ఈగల్ టీం.. గచ్చిబౌలి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రేవ్ పార్టీ భగ్నం చేశారు. మాదాపూర్ డీసీపీ వినీత్ దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ రైడ్ కు సంబంధించి డీసీపీ ఏమన్నారంటే, 'రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్‌లో రైడ్ నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాము. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్ ఫెడ్లర్లు తేజ, విక్రమ్ తోపాటు, ముగ్గురు వినియోగదారులు నీలిమ, పురుషోత్తం, భార్గవ్ ఉన్నారు. ట్రాన్స్‌పోర్టర్ చందన్ కూడా వీరిలో ఉన్నారు. అని డీసీపీ చెప్పారు.

నిందితుల నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, 20 గ్రాముల కొకైన్, 08 ఎక్స్టసీ పిల్స్, మూడు గ్రాముల ఎండిఎంఏ సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన రాహుల్, మణిదీప్ ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande