తెలంగాణ, ఆసిఫాబాద్. 25 ఆగస్టు (హి.స.)
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని
కాగజ్నగర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు పాల్వాయి హరిష్ బాబు, కోవలక్ష్మి యూరియా కోసం రైతులతో కలిసి ఆందోళన బాట పట్టారు. సోమవారం కాగజ్నగర్, ఆసిఫాబాద్ సహకార సొసైటీ కార్యాలయాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వ్యవసాయ అధికారులు స్థానిక వ్యాపారాలతో కుమ్మకై యూరియా కృత్రిమ కొరత సృష్టించి.. బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ఆరోపించారు.
280 రూపాయలకు లభించే యూరియా బస్తా రూ. 500 నుంచి రూ. 600 వందలకు అమ్ముతున్నారని..! ఈ విషయం వ్యవసాయ శాఖ అధికారులు తెలీకుండా ఉందని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా కొరత ఏర్పడిందని నిలదీశారు. రైతులకు యూరియా అందించడంలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు