హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)
ఒక్క విద్యార్థి మీద పోలీసుల లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రరావు హెచ్చరించారు. ఇందుకేనా విద్యాశాఖను, హోం శాఖను మీ వద్ద పెట్టుకున్నదని అని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక, పిరికిపంద చర్య అని ఆయన ఇవాళ ఒక ప్రకటనలో ఖండించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తోందన్నారు. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? అని నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..