రంగారెడ్డి, 25 ఆగస్టు (హి.స.)
యూరియా కోసం రైతులు
సహకార సంఘాల వద్ద గంటల తరబడి లైన్లో నిలబడి బారులు తీరారు. పూర్తి వివరాల్లోకెళితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ సహకార సంఘాల వద్ద ఎరువుల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. వ్యవసాయ పనులు ముమ్మరమైన నేపథ్యంలో ఎరువులు తప్పనిసరి అయ్యాయి. దీంతో రైతులు తెల్లవారి జామునుంచి సహకార సంఘాల వద్ద ఎరువుల కోసం గంటల తరబడి నిలబడుతున్నారు. దీంతో ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులకు సరిపడే యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్