లఖ్‌నవూ: 25 ఆగస్టు (హి.స.)
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ట్రాలీని కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 43 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ