హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి నేటి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో ఆదివారం నుంచే క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించడంతోపాటు నిరుద్యోగులు నిరసన తెలిపే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యూనివర్సిటీ మొత్తం ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా కంచెలు బిగించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకు? అని మండిపడ్డారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకని, విద్యార్థులేమైనా ఉగ్రవాదులా అని నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్