ముంబయి, 25 ఆగస్టు (హి.స.) దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి జీఎస్టీ సంస్కరణలపై ఉన్న ఆశాభావంతో సానుకూల సెంటిమెంట్ కనిపిస్తోంది. మనదేశ రేటింగ్‌ను ‘బీబీబీ-’ నుంచి ‘బీబీబీ’కి ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ సవరించడమూ ఉపకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు నేటి ట్రేడింగ్‌కు కలిసొచ్చాయి.
ఉదయం 9.32 గంటల సమయంలో సెన్సెక్స్ 266 పాయింట్లు పుంజుకొని 81,566 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 76.85 పాయింట్లు ఎగబాకి 24,946 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ సూచీలో టీసీఎస్, టెక్ మహీంద్రా, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా.. జియో ఫైనాన్షియల్, అపోలో హాస్పిటల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.39 వద్ద ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ