హైదరాబాద్, 25 ఆగస్టు (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా
యూనివర్సిటీకి వెళ్లిన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రివి అయి ఉండి విద్యా శాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా మీరు అని నిలదీశారు. యూనివర్సిటీలో అప్రకటిత కర్ఫ్యూ విధిస్తారా? విద్యార్థుల హక్కులను కాలరాస్తారా? అని మండిపడ్డారు.
ఇనుప కంచెలు,బ్యారికేడ్లు లేని ప్రజాపాలన అన్నారు.. మరి ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని వాటితో పాటు బెటాలియన్ల కొద్దీ పోలీసులతో ఎందుకు మోహరించారు అని ముఖ్యమంత్రిని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..