శ్రీశైలంి, 25 ఆగస్టు (హి.స.)వారం రోజుల క్రితం వరుసగా ఏర్పడిన వాయుగుండం, అల్పపీడనాలు, ఉపరితల ద్రోణుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy rains) కురిసిన సంగతి తెలిసిందే. అయితే గత నాలుగు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికి గోదావరి, కృష్ణా నదులకు భారీగా వరద పోటెత్తుతోంది. ముఖ్యంగా కృష్ణా నదికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు (Massive floods) వస్తున్నాయి. దీంతో ఇప్పటికే అధికారులు కృష్ణా రివర్ (Krishna River) పై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల, తుంగభద్ర జలాశయం నుంచి కంటిన్యూగా వరద వస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి (Srisailam Reservoir) గంట గంటకు వరద ఉధృతి పెరిగిపోతుంది. దీంతో ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టే.. 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 3,38,739 క్యూసెక్కులు వస్తుండగా.. 10 గేట్లు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 4,05,124 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌లోకి వదులుతున్నారు. దీంతో సాగర్ జలాశయం అధికారులు సైతం 24 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి