ఢిల్లీ: 25 ఆగస్టు (హి.స.)
సోషల్ మీడియాలో స్వేచ్ఛ పేరిట వేధింపులకు పాల్పడుతున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వికలాంగులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులను అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం వెలువరించింది. ట్రోలింగ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ