న్యూఢిల్లీ: , 25 ఆగస్టు (హి.స.) కేరళ కాంగ్రెస్‌లో ఓ నటి చేసిన ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీ అతనిపై చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే రాహుల్ మామకుటత్తిల్‌ను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. ఆయన పాలక్కాడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఓ ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, మూడేళ్లుగా వేధిస్తున్నారంటూ రీని జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఈవిషయాన్ని పలుమార్లు ఆ పార్టీ సీనియర్ల దృష్టికితీసుకెళ్లినా.. ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. రాహుల్ పేరును ఆమె నేరుగా ప్రస్తావించనప్పటికీ.. భాజపా, సీపీఎం శ్రేణులు ఆయన ప్రమేయం ఉందని ఆరోపించాయి. రాజీనామా చేయాలని నిరసనలు చేపట్టాయి. ఈనేపథ్యంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా ప్రకటించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ