హీరో బాలకృష్ణ పై డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర ట్వీట్
అమరావతి, 25 ఆగస్టు (హి.స.)టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం గా తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna)కు అరుదైన గౌరవం దక్కింది. నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వర
పవన్ కల్యాణ్


అమరావతి, 25 ఆగస్టు (హి.స.)టాలీవుడ్ సీనియర్ హీరో, నటసింహం గా తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna)కు అరుదైన గౌరవం దక్కింది. నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సంపాదించుకున్నారు.

ఈ మేరకు లండన్ కు చెందిన వారు ఆ రికార్డు పత్రాన్ని బాలయ్యకు అందజేశారు. ఈ అరుదైన ఘనతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో బాలనటుడిగా తెలుగు చలన చిత్ర రంగంలోకి స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా అడుగుపెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరుణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ( లండన్) లో చోటు సాధించిన ప్రముఖ నటులు, హిందూపురం MLA, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఇలానే మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande