ఈ రోజు నుంచి ఇంటింటికీ స్మార్ట్ రేషన్ కార్డులు.. ఉచితంగా పంపిణీ
అమరావతి, 25 ఆగస్టు (హి.స.)ఏపీ(Ap)లో కూటమి ప్రభుత్వం(Government) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సేవలో వినూత్నంగా ముందుకు వెళ్తోంది. గత ప్రభుత్వం రేషన్ పంపిణీ(Ration distribution) వ్యవస్థను తప్పుదారి పట్టిం
రేషన్ కార్డులు


అమరావతి, 25 ఆగస్టు (హి.స.)ఏపీ(Ap)లో కూటమి ప్రభుత్వం(Government) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సేవలో వినూత్నంగా ముందుకు వెళ్తోంది. గత ప్రభుత్వం రేషన్ పంపిణీ(Ration distribution) వ్యవస్థను తప్పుదారి పట్టించింది. దీంతో రేషన్ పంపిణీలో స్మార్ట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు సర్వంసిద్ధం చేసింది.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు సోమవారం నుంచి అమలు చేయనుంది. పీడీఎస్ రైస్ లబ్ధి పొందుతున్న ప్రతి ఇంటికీ వెళ్లి అధికారులు ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) అందించనున్నారు. మొత్తం నాలుగు విడతల్లో ఈ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఆయా రేషన్ షాపుల వద్ద సైతం అందజేయనున్నారు. మొదటి విడతగా 9 జిల్లాలో కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande