మేము ఓటు చోరీ చేస్తే 8 స్థానాల్లో మీరు ఎలా గెలిచారు? రఘునందన్ రావు
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) వంద సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారు.. మీపై మీకు విశ్వాసం ఉంటే శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళదామా? రాజీనామా చేసే దైర్యం ఉందా? అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. ఓటు చోరీపై
రఘునందన్ రావు


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

వంద సీట్లు గెలుస్తామని పీసీసీ

చీఫ్ అంటున్నారు.. మీపై మీకు విశ్వాసం ఉంటే శాసనసభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళదామా? రాజీనామా చేసే దైర్యం ఉందా? అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పీసీసీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. ఓటు చోరీపై పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఎంపీ తిప్పికొట్టారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారు.. పీసీసీ అధ్యక్షుడిగా ఏది పడితే అది మాట్లాడితే కుదరదన్నారు. ఓటు చోరీ చేస్తే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్ లో చేస్తాం కదా? మేము ఓటు చోరీ చేస్తే మీరెందుకు 8 మంది గెలుస్తారు? అసదుద్దీన్ ను ఎందుకు గెలిపిస్తాం? అని ప్రశ్నించారు. దమ్ముంటే మీ 8 మంది ఎంపీలను రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande