మృగత్వానికి ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులే : మధుసూదనాచారి
హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి బజారు భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ లో ఆయన మాట్లాడారు. ఫామ్ హౌజ్లో మానవ మృగాలు ఉన్నాయని రేవంత్ రె
మధుసూదనాచారి


హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)

సీఎం రేవంత్ రెడ్డి బజారు భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మంగళవారం తెలంగాణభవన్ లో ఆయన మాట్లాడారు. ఫామ్ హౌజ్లో మానవ మృగాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం తీవ్రమైన విషయమన్నారు.

కేసీఆర్కు, తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మధుసూదనాచారి డిమాండ్ చేశారు. అహింస పద్ధతుల్లో తెలంగాణ తెచ్చిన మరో గాంధీ కేసీఆర్ అని అన్నారు. మృగత్వానికి ప్రతిరూపాలు కాంగ్రెస్ పాలకులే అని చెప్పారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రజలతో హాహాకారాలు చేయించిన ఇందిరాగాంధీ మృగత్వానికి ప్రతీక అన్నారు. నాడు ఢిల్లీలో టర్క్ మెన్ గేట్ దగ్గర వేలాది పేదల ఇండ్లు కూల్చిన మృగత్వం కాంగ్రెస్ పార్టీ సొంతమని విమర్శించారు.

1969 ఉద్యమంలో వందలాది మందిని పొట్టన పెట్టుకున్న మృగత్వం కాంగ్రెస్ పార్టీదేనని, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మృగత్వం ఆనవాళ్లను వంట పట్టించుకున్నారని మధుసూదనాచారి విమర్శించారు. హామీలను నెరవేర్చడం చేతగాకనే సీఎం రేవంత్ రెడ్డి పిచ్చి భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande