హైదరాబాద్, 26 ఆగస్టు (హి.స.)
తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ (NGT) బిగ్ షాకిచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ప్రారంభించిన నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చే వరకు స్పాట్లో ఎలాంటి పనులు చేపట్టరాదని ఇవాళ స్పష్టమైన ఆర్డర్స్ విడుదల చేసింది. కాగా, నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నారాయణపేట మరియు కొడంగల్ నియోజకవర్గాలకు నీటి పారుదల సౌకర్యాలు కల్పించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..