వేములవాడ, 26 ఆగస్టు (హి.స.)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మంగళవారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలకు వెళ్ళే 10 తరగతి విద్యార్థుల ఇబ్బందులు తీర్చాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే ఈ సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తాను ఇస్తున్న ఈ సైకిళ్లు... బతుకమ్మ చీరల వంటివి కాదని పూర్తి బ్రాండెడ్ అన్నారు. రాజన్న ఆశీస్సులతో మీరు ఓట్లు వేస్తే గెలిచానని, శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి నైవేద్యంగా విద్యార్థులకు ఈ సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు